ఓక్లహోమలో టోర్నడోల ప్రతాపం
బలమైన గాలి, మేఘాలతో కూడిన టోర్నడోలు అమెరికాలోని ఓక్లహోమ పట్టణంలో ఆదివారం ప్రతాపం చూపించాయి. వీటి బలమైన తాకిడికి ఇళ్ల పైకప్పులు కూడా లేచిపోయాయి. కొన్ని భవనాలకు నష్టం వాటిల్లింది. విమాన సేవలకు అంతరాయం కలిగింది. తర్వాత ఈ టోర్నడోలు విచితా, కన్సాస్ పట్టణాల వైపు తరలి వెళ్లాయి. వీటివల్ల జరిగిన నష్టమెంత? ఎంతమంది గాయపడ్డారు? అన్న దానిపై సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.