నితిన్ సార్... నేను మీకు చాలా లక్కీ: రష్మిక
- త్వరలో శాలినితో హీరో నితిన్ వివాహం
- శుభాకాంక్షలు తెలిపిన హీరోయిన్ రష్మిక
- ఎంతో సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యలు
"కంగ్రాచ్యులేషన్స్ నితిన్ సార్! చూడండి, నేను మీకు ఎంత అదృష్టం తీసుకువచ్చానో! మీరు నాతో నటిస్తున్నారో లేదో ఓ ఇంటివారు కాబోతున్నారు. మీ ఇద్దరూ పెళ్లితో ఒక్కటవుతుండడం పట్ల ఎంత సంతోషంగా ఉన్నానో!" అంటూ రష్మిక ట్వీట్ చేసింది. ప్రస్తుతం నితిన్ భీష్మ అనే చిత్రం చేస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రష్మికే హీరోయిన్. అందుకే ఈ సరదాగా ఈ ట్వీట్ చేసింది.