పాటల కోసం గోవా వెళ్లనున్న చిరూ చిన్నల్లుడు
- కల్యాణ్ దేవ్ రెండో సినిమాగా 'సూపర్ మచ్చి'
- కథానాయికగా రచితా రామ్ పరిచయం
- వేసవిలో విడుదల చేసే ఆలోచన
ఈ సినిమా టాకీ పార్టుతో పాటు మూడు పాటల చిత్రీకరణను కూడా పూర్తి చేసుకుంది. మిగతా రెండు పాటలను గోవాలో చిత్రీకరించనున్నారు. అందుకోసం ఈ సినిమా టీమ్ వచ్చేనెలలో గోవా వెళ్లనుంది. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు. క్యాచీ టైటిల్ తో వస్తున్న కల్యాణ్ దేవ్ ఈ సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలి.