రేపు రాజధాని గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటన
- అమరావతి రైతులు, మహిళలతో మాట్లాడనున్న జనసేనాని
- మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి పర్యటన షురూ
- ఎర్రబాలెం మీదుగా తుళ్లూరు వరకు పర్యటన
- ఆదివారం వరుస సమావేశాలతో పవన్ బిజీ
కాగా, ఆదివారం కూడా పవన్ పార్టీ కార్యక్రమాలతో బిజీగా వుంటారు. ఉదయం 10 గంటలకు రేపల్లె జనసైనికులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లిగూడెం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఆపై, జనసేన న్యాయ విభాగం సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.