'ఆకాశం నీ హద్దురా' నుంచి సాంగ్ ప్రోమో
- సూర్య తాజా చిత్రంగా 'సూరరై పొట్రు'
- తెలుగు టైటిల్ గా 'ఆకాశం నీ హద్దురా'
- కథానాయికగా అపర్ణ బాలమురళి
తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. 'పిల్లా పులి ..' అంటూ ఈ పాట మొదలవుతోంది. 'ఎరవేశావే సంకురాతిరి సోకుల సంపదని .. నరికేశావే నా రాతిరి నిద్దరని' అంటూ సాగుతోంది. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయికగా అపర్ణ బాలమురళి అలరించనుంది. పైలెట్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.