Revanth Reddy: కనికరం లేని కసాయి ముఖ్యమంత్రి గారూ..!: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'వేల మంది రైతులు పిట్టల్లా నేల రాలుతున్నా, కనికరం లేని కసాయి ముఖ్యమంత్రి గారూ.. రైతుల ప్రాణాలను గాలికి వదిలేయకండి' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తాను నిన్న కేసీఆర్‌కు రాసిన లేఖలోని అంశాలను గురించి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు.
రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని అందులో రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కలెక్టర్ల సమావేశంలో 12 గంటల ఉపన్యాసం ఇచ్చిన కేసీఆర్ ఐదు నిమిషాలైనా రైతుల సమస్యలపై చర్చించలేదని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతు సమన్వయ సమితిలు విఫలమయ్యాయని ఆయన విమర్శలు గుప్పించారు.