‘దర్బార్’ డైలాగ్‌కు.. రజనీకాంత్ పోటీకి లింకు.. తమిళనాడులో జోరుగా ప్రచారం
- వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో వేప్పనహళ్లి నుంచి పోటీకి రజనీ?
- దర్బార్ సినిమాలో రజనీ చెప్పిన డైలాగ్‌ను ఉటంకిస్తున్న మద్దతుదారులు
- వేప్పనహళ్లిలో రజనీ మక్కల్ మండ్రం సేవా కార్యక్రమాలు
ఇటీవల విడుదలైన ‘దర్బార్’ సినిమాలో రజనీకాంత్ ఓ సందర్భంలో తన సొంతూరు కృష్ణగిరి జిల్లాలోని నాచ్చికుప్పమని చెబుతాడు. ఇది వేప్పనహళ్లి నియోజకవర్గం పరిధిలోనే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఆ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. రజనీ మక్కళ్ మండ్రం నిర్వాహకులు ఈ నియోజకవర్గంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. దీనికి రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణరావు కూడా హాజరయ్యారు. దీంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్టు అయింది.