ఈ నెల 17 నుంచి ఏపీలో టీడీపీ ప్రజా చైతన్య యాత్రలు

  • విజయవాడలో ముగిసిన టీడీపీ రాష్ట్ర విస్త్రృత స్థాయి సమావేశం
  • అన్ని నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్రలు
  • 45 రోజుల పాటు నిర్వహించేందుకు కార్యాచరణ
విజయవాడలో ఇవాళ నిర్వహించిన టీడీపీ రాష్ట్ర విస్త్రృత స్థాయి సమావేశం ముగిసింది. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ నెల 17 నుంచి అన్ని నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జిల ఆధ్వర్యంలో టీడీపీ ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాలని నిర్ణయించింది.

45 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్ర నిర్వహణకు టీడీపీ కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రజా చైతన్య యాత్రలు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను, సంక్షేమ పథకాలపై కోతను, ఇసుక, భూములు, గనుల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాబు చెప్పినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.



More Telugu News

Chandrababu Telugudesam prajachaitanya Yatra