గుంటూరు జిల్లాలో ఆటో- లారీ ఢీ.. నలుగురి దుర్మరణం

  • పలువురికి తీవ్రగాయాలు
  • ఫిరంగిపురం మండలం రేపూడి సమీపంలో ఘోరం
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పొలీసులు
ఆటో, లారీ పరస్పరం ఢీకొట్టుకున్న ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలవ్వగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి సమీపంలో ఈరోజు ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో, ఎదురుగా వస్తున్న లారీ పరస్పరం ఢీకొట్టుకోవడంతో ఈ ఘోరం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Crime News
Road Accident
fourdead
Guntur District

More Telugu News