రైల్వే పట్టాలపై ట్రక్కును ఢీ కొన్న రైలు.. సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాలు
- టర్కీలోని అఫియాన్లో ఘటన
- తప్పిన ప్రాణాపాయం
- నిబంధనలు పట్టించుకోకుండా ట్రక్కు నడిపిన డ్రైవర్
రైల్వే ట్రాకును దాటకూడదని, రైలు వస్తోందని సూచిస్తూ అక్కడ సిగ్నల్స్ పడ్డప్పటికీ, బారియర్లు మూసేసి ఉన్నప్పటికీ ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అదే సమయంలో రైలు వచ్చి ట్రక్కును ఢీ కొంది. ఆ ట్రక్కులోని బ్రెడ్ ప్యాకెట్లు అన్నీ నాశనమయ్యాయి. కొన్ని మీటర్ల వరకు ఎగిరిపడడంతో ట్రక్కు పూర్తిగా ధ్వంసమైపోయింది. అయితే, అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది.