డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుంటే... పోలీసులకే మస్కా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుంటే... పోలీసులకే మస్కా!

  • శనివారం నాడు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
  • మందు కొట్టి వచ్చిన కారు డ్రైవర్
  • బైక్ లను ఢీ కొడుతూ పారిపోయిన యువకుడు
గత రాత్రి హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహస్తుండగా, పోలీసులకే మస్కా కొట్టి పారిపోయాడో మందుబాబు. అతనిపై జూబ్లీహిల్స్ పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే, శనివారం రాత్రి పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 34 కార్లు, 47 బైక్ లు, 4 ఆటోలు నడుపుతున్న వారు మద్యం తాగి ఉన్నారని పోలీసులు తేల్చారు. వారందరి వాహనాలనూ స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలో జూబ్లీహిల్స్ వద్ద తనిఖీలు చేస్తుండగా, ఓ కారును నడుపుకుంటూ వచ్చిన యువకుడు, బ్రీత్ అనలైజర్ లో ఊదుతున్నట్టు నటిస్తూ, కారును వేగంగా తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటనలో కారు ముందున్న మరో రెండు బైకులనూ ఢీకొట్టాడు. కారు నంబర్ ను లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు, అతనిపై ఫిర్యాదు చేశారు.
Hyderabad
Police
Drunk Driving

More Telugu News