Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లవర్ ఓకే చెప్పలేదట... పోలీసుల ముందే గొంతు కోసుకున్న యువతి!

  • హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో ఘటన
  • ఆటో డ్రైవర్ కు పరిచయం అయిన బ్యూటీషియన్
  • పెళ్లికి అంగీకరించలేదని ఆత్మహత్యాయత్నం
తాను ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడం లేదన్న మనస్తాపంతో ఓ యువతి పోలీసుల ముందే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన హైదరాబాద్, జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, రాజమండ్రికి చెందిన వీరబాబు (20) ఆటో డ్రైవర్ గా పని చేస్తుండగా, లింగంపల్లిలో బ్యూటీషియన్ గా పని చేస్తున్న స్వప్న (20) అతనికి టిక్ టాక్ లో పరిచయం అయింది.

వారి స్నేహం ప్రేమగా మారగా, పలుమార్లు స్వప్నను వీరబాబు తన గదికి పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు సన్నిహితంగా మెలిగాడు. రెండు వారాల క్రితం తనను వివాహం చేసుకోవాలని స్వప్న నిలదీయగా, వీరబాబు నిరాకరించాడు. ఆమె పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేసింది. ఇద్దరినీ పిలిపించిన పోలీసులు, కౌన్సిలింగ్ నిర్వహించినా, వీరబాబులో మార్పు కనిపించలేదు. తాను స్వప్నను పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేనని వీరబాబు గట్టిగా చెప్పడంతో, స్టేషన్ లోనే బ్లేడుతో గొంతు కోసుకుంది.

ఆ వెంటనే స్పందించిన పోలీసులు, స్వప్నను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం స్వప్నకు చికిత్స నిర్వహిస్తున్నామని, ఆమె కోలుకుంటోందని డాక్టర్లు వెల్లడించారు. ఇక తన ప్రియుడు వ్యవహరించిన తీరుపై ఆమె ఓ సెల్ఫీ వీడియోను తీసి, సోషల్ మీడియాలో పెట్టగా అదిప్పుడు వైరల్ అయింది. ఈ కేసులో వీరబాబును అరెస్ట్ చేసిన పోలీసులు, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని వెల్లడించారు.
Lover
Sucide Attempt
Jubleehills
Hyderabad
Police

More Telugu News