చిన్న పిల్ల అయినా రుతుక్రమం ప్రారంభమైంది.. ఈ పెళ్లి చెల్లుతుంది: పాకిస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు
- 14 ఏళ్ల క్రిస్టియన్ బాలికను అపహరించిన అబ్దుల్ జబ్బార్ అనే వ్యక్తి
- మతాన్ని మార్పించి పెళ్లాడిన వైనం
- వివాహం చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించిన బాలిక తల్లిదండ్రులు
ఈ కేసును విచారించిన హైకోర్టు... బాలిక వయసు తక్కువగా ఉన్నప్పటికీ ఆమెకు రుతుక్రమం ప్రారంభమైందని... షరియా చట్టాల ప్రకారం ఒకసారి రుతుక్రమం పూర్తైనా ఆమె వివాహం చెల్లుతుందని తీర్పును వెలువరించింది.
ఈ సందర్భంగా హూమా తల్లిదండ్రుల తరపు న్యాయమాది తబస్సుమ్ మాట్లాడుతూ, సింధ్ బాల్య వివాహ చట్టానికి అనుగుణంగా కోర్టు తీర్పు వెలువడలేదని... తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
సింధ్ ప్రావిన్స్ లో ముఖ్యంగా హిందు, క్రిస్టియన్ సామాజికవర్గాలకు చెందిన మైనర్ బాలికలను బలవంతంగా పెళ్లిచేసుకునే చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు 2014లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు బాలికల వివాహం చెల్లదు. అయినా, ఈ చట్టాన్ని కాదని సింధ్ హైకోర్టు తీర్పును వెలువరించడం గమనార్హం.