చిన్న పిల్ల అయినా రుతుక్రమం ప్రారంభమైంది.. ఈ పెళ్లి చెల్లుతుంది: పాకిస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు 
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్న పిల్ల అయినా రుతుక్రమం ప్రారంభమైంది.. ఈ పెళ్లి చెల్లుతుంది: పాకిస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు 

  • 14 ఏళ్ల క్రిస్టియన్ బాలికను అపహరించిన అబ్దుల్ జబ్బార్ అనే వ్యక్తి
  • మతాన్ని మార్పించి పెళ్లాడిన వైనం
  • వివాహం చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించిన బాలిక తల్లిదండ్రులు
పాకిస్థాన్ ప్రభుత్వాలే కాదు అక్కడి న్యాయ వ్యవస్థ కూడా అడ్డదిడ్డంగానే ఉన్నట్టుంది. రుతుక్రమం ప్రారంభమైంది కాబట్టి బాలిక వివాహం చెల్లుతుందంటూ పాకిస్థాన్ లోని సింధ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కేను వివరాల్లోకి వెళ్తే, 14 ఏళ్ల పాకిస్థానీ క్రిస్టియన్ బాలిక హూమాను అబ్దుల్ జబ్బార్ అనే వ్యక్తి అపహరించి, బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి, పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తమ కుమార్తె వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమేనని, ఈ వివాహం చెల్లదంటూ ఆమె తల్లిదండ్రులు సింధ్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన హైకోర్టు... బాలిక వయసు తక్కువగా ఉన్నప్పటికీ ఆమెకు రుతుక్రమం ప్రారంభమైందని... షరియా చట్టాల ప్రకారం ఒకసారి రుతుక్రమం పూర్తైనా ఆమె వివాహం చెల్లుతుందని తీర్పును వెలువరించింది.

ఈ సందర్భంగా హూమా తల్లిదండ్రుల తరపు న్యాయమాది తబస్సుమ్ మాట్లాడుతూ, సింధ్ బాల్య వివాహ చట్టానికి అనుగుణంగా కోర్టు తీర్పు వెలువడలేదని... తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

సింధ్ ప్రావిన్స్ లో ముఖ్యంగా హిందు, క్రిస్టియన్ సామాజికవర్గాలకు చెందిన మైనర్ బాలికలను బలవంతంగా పెళ్లిచేసుకునే చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు 2014లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు బాలికల వివాహం చెల్లదు. అయినా, ఈ చట్టాన్ని కాదని సింధ్ హైకోర్టు తీర్పును వెలువరించడం గమనార్హం.
Child Marriage
Pakistan
Sindh High Court

More Telugu News