ఢిల్లీ ఓటర్లకు ఉచిత ఆఫర్లు ప్రకటించిన రవాణా సంస్థలు!
- పోలింగ్ సందర్భంగా బైక్, బస్సు, విమానయాన సంస్థల ప్రకటన
- రాపిడో, అభీబస్ డాట్‌కాం ఉచిత సేవలు
- బేస్ టికెట్ చార్జి తిరిగిస్తామన్న స్పైస్‌జెట్
ఇందులో ఆటోలు, బైక్‌లే కాదు స్పైస్ జెట్ విమానయాన సంస్థ కూడా ఉచిత సర్వీస్ అందిస్తానంది. బైక్-టాక్సీ బుకింగ్ యాప్ ‘రాపిడో’ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీ ఓటర్లకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ వరకూ ఫ్రీ రైడింగ్ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది.
అదేవిధంగా ‘అభీ బస్ డాట్ కామ్’ కూడా ‘ఐ ఓట్ ఐ విన్’ అనే నినాదంతో ఉచిత బస్సు సేవలకు ముందుకు వచ్చింది. ఎయిర్ లైన్స్ కంపెనీ స్పైస్ జెట్ ఈరోజు ఢిల్లీ వచ్చేవారు, తిరిగి ఇదే రోజు వెళ్లిపోతే రానుపోను టిక్కెట్లపై బేస్ చార్జీని వాపసు ఇవ్వనున్నట్లు తెలిపింది.