అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్.. మరో ఐదుగురిపై సీఐడీ కేసులు
- ఇన్సైడర్ ట్రేడింగ్ లో విచారణను ముమ్మరం చేసిన సీఐడీ
- అసైన్డ్ భూములు కొన్నవారి వివరాలు ఐటీ శాఖకు
- అక్రమ రేషన్ కార్డులను రద్దు చేయాలని కలెక్టర్ కు విన్నపం
మరోవైపు అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన 106 మంది జాబితాను ఐటీ శాఖకు సీఐడీ అధికారులు మరోసారి పంపించారు. అసైన్డ్ భూములను కొన్నవారితో పాటు, రూ. 2 లక్షలకు పైగా మొత్తాలను నగదు రూపంలో చెల్లించినవారి వివరాలను కూడా అందజేశారు. అంతేకాకుండా, విలువైన ఆస్తులను కలిగి ఉండి, నిబంధనలకు విరుద్ధంగా తెల్ల రేషన్ కార్డులను పొందినవారి కార్డులను రద్దు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ను సీఐడీ అధికారులు కోరారు.