ఎన్టీఆర్ విద్యాసంస్థల వార్షికోత్సవానికి హాజరైన నారా భువనేశ్వరి

  • ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళుతున్నామన్న భువనేశ్వరి
  • జీవిత లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలని ఉద్బోధ
  • వ్యక్తిగత జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని సూచన
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ విద్యాసంస్థల వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, నాణ్యమైన విద్యను అందించేందుకు ఎన్టీఆర్ విద్యాసంస్థలు ఎల్లప్పుడూ ముందుంటాయని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో విద్యాసంస్థలను ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. జీవనశైలి సాధారణంగా ఉన్నా జీవిత లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలని సూచించారు. చిన్నచిన్న ఆనందాలే జీవితాన్ని మధురంగా మార్చుతాయని అన్నారు. వ్యక్తిగత జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని, కొందరు అసత్యాలు ప్రచారం చేస్తుంటారని, సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా మెలగాలని హితవు పలికారు.
Go Back to Shorts
NTR
Nara Bhuvaneswari
Chandrababu
Hyderabad
Telugudesam

More Telugu News