సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లతో రేవంత్ రెడ్డి... ఫొటో ఇదిగో!
- ఇవాళ జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో సర్వీసు ప్రారంభం
- రిబ్బన్ కట్ చేసిన సీఎం కేసీఆర్
- ప్రారంభోత్సవానికి హాజరైన రేవంత్
ఈ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్ చేస్తుండగా, ఆ వైపు మంత్రి కేటీఆర్, ఈ వైపు రేవంత్ రెడ్డి నిల్చున్నారు. మంత్రి తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఎంపీ హోదాలో రేవంత్ ను కూడా ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం జరిగింది.