సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • కెరీర్ గురించి సమంత కామెంట్స్ 
  • మే నుంచి నాని కొత్త చిత్రం 
  • చీరాల బీచ్ వద్ద రవితేజ షూటింగ్
 *  ఇక రెండు మూడేళ్ల పాటే తాను సినిమాల్లో నటిస్తానని అంటోంది అందాలతార సమంత. 'మేరేజ్ అయ్యాక కూడా సినిమాల్లో నటిస్తున్నాను. అయితే, నాకూ కుటుంబం వుంది కదా, బాధ్యతలు వుంటాయి కదా, అందుకే మహా అయితే మరో రెండు మూడేళ్ల పాటు నటిస్తానేమో' అని చెప్పింది. అందుకే చేయబోయే సినిమాలన్నీ ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలే చేస్తానని పేర్కొంది.  
*  ప్రస్తుతం 'వి' పేరిట ఓ చిత్రాన్ని చేస్తున్న హీరో నాని, దీని తర్వాత 'టాక్సీవాలా' ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. సాయిపల్లవి కథానాయికగా నటించే ఈ చిత్రం షూటింగ్ మే నెల నుంచి జరుగుతుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ దీనిని నిర్మిస్తుంది.
*  రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'క్రాక్' చిత్రం షూటింగ్ ప్రస్తుతం చీరాల సమీపంలోని రామాపురం బీచ్ లో జరుగుతోంది. ఓ పాటను, కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
Samantha
Nani
Sai Pallavi
Raviteja

More Telugu News