ఆకట్టుకుంటున్న 'జాను' సాంగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆకట్టుకుంటున్న 'జాను' సాంగ్

  • రేపు విడుదల కానున్న 'జాను'
  • '96' సినిమాకి రీమేక్  
  • సంగీత దర్శకుడిగా గోవింద్ వసంత 
తమిళంలో ఆ మధ్య విడుదలైన '96' సినిమా, వైవిధ్యభరిత చిత్రంగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. విజయ్ సేతుపతి - త్రిష జంటగా చేసిన ఆ సినిమాను దర్శకుడు ప్రేమ్ కుమార్ గొప్పగా తెరకెక్కించాడు. అదే దర్శకుడితో తెలుగులో ఈ సినిమాను నిర్మాత 'దిల్' రాజు రీమేక్ చేశాడు. శర్వానంద్ - సమంత జంటగా 'జాను' టైటిల్ తో ఈ సినిమా రూపొందింది. రేపే ఈ సినిమా థియేటర్స్ కి రానుంది.

గోవింద్ వసంత సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. "కాలాల ప్రేమ .. పుట్టేది ఎప్పుడంటే ఏమో కదా .. యుగాల ప్రేమ .. జగాల నేలుతోంది రాజులాగా .. శపించు వరమా" అంటూ సాగుతోంది. చిన్మయి శ్రీపాద .. గోవింద్ వసంత ఆలాపన .. శ్రీమణి సాహిత్యం బాగున్నాయి. తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
Sharwanand
Samantha
Jaanu Movie

More Telugu News