ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలి: రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి

  • విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
  • ప్రత్యేక హోదా అమలు కావడంలేదు
  • నిధుల కేటాయింపులో ఏపీకి అన్యాయం జరిగింది
ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని ఎంపీ  విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ.. కేంద్రం ఆ సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఆయన ప్రశ్నించారు. పలు హామీలు ఇప్పటికీ అమలు కాలేదని పేర్కొన్నారు. విభజన హామీల్లో భాగంగా.. రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందన్నారు.

రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేక హోదా అంశం లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.  
Go Back to Shorts
Vijayasai Reddy
Rajyasabha
AP Special Status

More Telugu News