మీరు నైట్ డ్యూటీలు చేస్తారా?.. అయితే ఇది మీకోసమే!
- వారానికో రకమైన షిప్టులో పనిచేసే వారిలోనూ సమస్యలు
- నిద్రలేమి కారణంగా గతి తప్పే జీవగడియారం
- హృద్రోగ సమస్యలు, షుగర్, బీపీ వచ్చే అవకాశం
ఇలాంటి షిఫ్టుల్లో పనిచేసేవారిలో నిద్రలేమి కారణంగా జీవగడియారం గతి తప్పుతుందని, ఫలితంగా జీవక్రియలు మందగిస్తాయని తేలింది. ముఖ్యంగా బీపీ, షుగర్ పెరగడంతోపాటు పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరించింది. ఈ విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే హృద్రోగాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాబట్టి సరైన నిద్రతోపాటు ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.