ప్రార్థించిన నూనెను తాకేందుకు ఉరికిన భక్తులు... చర్చిలో తొక్కిసలాటలో 20 మంది మృతి!
- టాంజానియాలో ప్రత్యేక ప్రార్థనలు
- మంత్రించిన నూనెను వేదిక ముందు పోసిన పాస్టర్
- దాన్ని తాకేందుకు ఒక్కసారిగా దూసుకొచ్చిన భక్తులు
- ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఆ నూనెను తాకితే ఎన్నో రోగాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మే భక్తులు, ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడి, తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సరైన ఏర్పాట్లు చేయకుండా తొక్కిసలాటకు కారణమయ్యారని ఆరోపిస్తూ, పాస్టర్ సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.