హైదరాబాద్లో పెరుగుతున్న ‘కరోనా’ అనుమానిత కేసులు
- నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి మరో ఇద్దరు అనుమానితులు
- నమూనాలు సేకరించి పరీక్షల కోసం ‘గాంధీ’కి పంపిన వైద్యులు
- ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో మరో ముగ్గురు అనుమానితులు
వీరిద్దరూ ఇటీవలే చైనా నుంచి నగరానికి చేరుకున్నారు. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వారిలో వైరస్ ప్రభావం కనిపించలేదని తెలిపారు. అయినప్పటికీ వారి నమూనాలు సేకరించి పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి పంపారు. ప్రస్తుతం మరో ముగ్గురు అనుమానితులు ఐసోలేషన్ వార్డులో ఉన్నట్టు వైద్యులు తెలిపారు.