చివరి టి20 కూడా టీమిండియాదే... కివీస్ కు తప్పని వైట్ వాష్
- టీమిండియా స్కోరు 163/3
- లక్ష్యఛేదనలో 9వికెట్లకు 156 పరుగులే చేసిన న్యూజిలాండ్
- 5-0తో సిరీస్ భారత్ కైవసం
అయితే, చివరి ఓవర్లో ఇష్ సోధీ ఊపు చూస్తే ఆతిథ్య జట్టు గెలుస్తుందనే అనిపించింది. రెండు భారీ సిక్సర్లతో టీమిండియా శిబిరంలో గుబులు రేపాడు. అయితే, చివరి రెండు బంతుల్లో భారీ షాట్లు కొట్టలేకపోవడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది.
ఓ దశలో కివీస్ సజావుగానే లక్ష్యఛేదన చేస్తుందనిపించినా, బుమ్రా కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆ జట్టుపై ఒత్తిడి పెంచాడు. ఈ మ్యాచ్ లో బుమ్రాకు 3, సైనీకి 2, ఠాకూర్ కు 2 వికెట్లు దక్కాయి. సుందర్ ఓ వికెట్ తీశాడు. మౌంట్ మాంగనుయ్ లో జరిగిన ఈ మ్యాచ్ ను నెగ్గడం ద్వారా భారత్ ఈ సిరీస్ లో 5-0తో కివీస్ ను వైట్ వాష్ చేసినట్టయింది.