సినిమా కోసమే అలా చేశాను... దయచేసి ఎవరూ నన్ను ఫాలో కావద్దు: అల్లు అర్జున్
- బ్లాక్ బస్టర్ హిట్టయిన అల.. వైకుంఠపురములో
- వరుస సక్సెస్ మీట్లతో చిత్రబృందం హుషారు
- సిత్తరాల సిరపడు పాటలో పొగతాగుతూ కనిపించిన బన్నీ
- రియల్ లైఫ్ లో తాను సిగరెట్లకు దూరమని వెల్లడి
తమను కూడా విజయోత్సవాల్లో భాగం చేయాలని డిస్ట్రిబ్యూటర్లు ఎప్పటినించో అడుగుతున్నారని, వాళ్ల కోసం తప్పకుండా ఓ ఫంక్షన్ నిర్వహిస్తానని అప్పట్లో మాటిచ్చానని తెలిపారు. ఇప్పుడు అల... వైకుంఠపురములో చిత్రం అదిరిపోయే హిట్ కావడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అయితే, తాను ఈ సినిమాలో 'సిత్తరాల సిరపడు' పాటలో పొగ తాగుతూ కనిపిస్తానని, కానీ అది సినిమా కోసం చేసిందని, దయచేసి అభిమానులెవరూ తనను ఫాలో కావొద్దని హితవు పలికారు. రియల్ లైఫ్ లో తాను సిగరెట్లకు చాలా దూరంగా ఉంటానని తెలిపారు.