బ్రేకింగ్... విశ్వహిందూ మహాసభ చీఫ్ దారుణ హత్య!
- మార్నింగ్ వాక్ కు వెళ్లిన రంజిత్ బచ్చన్
- తలలోకి బుల్లెట్లు దింపిన దుండగులు
- రంజిత్ సోదరుడి పరిస్థితి విషమం
విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్ ఈ ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. లక్నోలోని హజరత్ గంజ్ లో ఉదయం మార్నింగ్ వాక్ కు రంజిత్ వెళ్లిన వేళ ఈ దారుణం జరిగింది. తన సోదరుడితో కలిసి ఆయన వాకింగ్ చేస్తుండగా, దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రంజిత్ తలలోకి బుల్లెట్ దిగడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయన సోదరుడిని ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన లక్నోలో తీవ్ర కలకలం రేపింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, నిందితుల ఆచూకీ కోసం ఆరు ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా గుర్తిస్తామని అన్నారు. ఇటీవలి కాలంలో యూపీలో హిందుత్వ ప్రతినిధులను కాల్చిచంపిన ఘటనల్లో ఇది రెండవది కావడం గమనార్హం. 2019 అక్టోబర్ లో హిందూ సమాజ్‌పార్టీ నాయకుడు కమలేశ్ తివారీని కాల్చి చంపిన ఘటన తెలిసిందే.