Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నటుడు ప్రదీప్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దర్శకుడు!

  • గతంలో యువతిని వేధించిన కేసులో జైలుకు వెళ్లిన ప్రదీప్
  • సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించాడన్న దర్శకుడు
  • సినిమా షూటింగ్ ను ఆపాలని ఫిర్యాదు
ప్రముఖ బుల్లితెర యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు నటించడానికి వీల్లేదంటూ, ఓ యువ దర్శకుడు పోలీసులను ఆశ్రయించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?" అనే చిత్రం ప్రదీప్ హీరోగా రూపొందనున్నట్టు ఇటీవల ఎనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే, గతంలో ఓ యువతిని వేధించిన కేసులో ప్రదీప్ రెండు రోజులు జైలుకు వెళ్లి వచ్చాడు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ రూల్స్‌ కు వ్యతిరేకంగా ప్రదీప్‌ ప్రవర్తించినందున, ఈ చిత్రం షూటింగ్ ను అడ్డుకోవాలని, ప్రదీప్ నటించకుండా చూడాలని మేడ్చల్‌ జిల్లా రాంపల్లికి చెందిన శ్రీ రామోజు సునిశిత్‌ అనే యువ దర్శకుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆపై మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రదీప్‌ తో పాటు సినీ దర్శకుడు కూడా నిబంధనలను అతిక్రమించారని ఆరోపించాడు. షూటింగ్‌ ఆపాలని తక్షణం ఆదేశాలు జారీ చేయాలని కోరాడు. ఈ విషయంలో ఇంకా కేసును నమోదు చేయని పోలీసులు, కేసును స్వీకరించామని, న్యాయ సలహా తీసుకున్న అనంతరం కేసు విషయమై ఆలోచిస్తామని వ్యాఖ్యానించారు.
Pradeep Machiraju
Anchor
Actor
Police
Complaint

More Telugu News