‘నిర్భయ’ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ పై రామ్ గోపాల్ వర్మ ఫైర్
- ‘నిర్భయ’ దోషులకు ఉరిశిక్ష వాయిదాపై వర్మ విమర్శ
- న్యాయవాది ఏపీ సింగ్ పై విమర్శల వర్షం
- ఈ దోషులకు ఉరిశిక్ష పడనివ్వనని సవాల్ చేస్తున్నాడు!
ఈ సందర్భంగా ఏపీ సింగ్ గతంలో షేర్ చేసిన ఓ వీడియోను వర్మ పోస్ట్ చేశారు. నీతి నియమాలను ఉల్లంఘిస్తే తన కూతురినైనా సరే, కాల్చేస్తానని ఆ వీడియోలో ఏపీ సింగ్ మాట్లాడటం కనబడుతుంది. మురికి మనిషి ఏపీ సింగ్ ‘నిర్భయ’ దోషులకు ఉరిశిక్ష పడనివ్వనని సవాల్ చేస్తున్నాడని.. తాను విన్న అత్యంత అసహ్యకరమైన విషయం ఇదేనంటూ వర్మ వరుస ట్వీట్లు చేశారు.