నేడు, రేపు జాతీయ బ్యాంకుల బంద్.. ప్రైవేటు బ్యాంకులు పనిచేస్తాయి!
- 2017 నుంచి పెండింగులో వేతన సవరణ
- పరిష్కరించాలంటూ పలుమార్లు చర్చలు
- ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులు పనిచేస్తాయి
బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఫలితంగా నేడు, రేపు బ్యాంకులు మూతపడనున్నాయి. ఎల్లుండి ఆదివారం కావడంతో ఆ రోజు కూడా సెలవే. అంటే వరుసగా మూడు రోజులు బ్యాంకుల మూత తప్పదు. అయితే, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి ప్రైవేటు బ్యాంకులకు మాత్రం ఈ సమ్మె ప్రభావం లేదు. ప్రైవేటు బ్యాంకులన్నీ యథావిధిగా పనిచేస్తాయని సదరు బ్యాంకుల వర్గాలు తెలిపాయి.