చైనాలో ఉన్న తెలుగు ఇంజినీర్లను స్వదేశం తీసుకురావాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ
- చైనాలోని వుహాన్ నగరంలో చిక్కుకుపోయిన తెలుగు ఇంజినీర్లు
- విదేశాంగ మంత్రికి లేఖ రూపంలో చంద్రబాబు విజ్ఞప్తి
- బాధితుల కుటుంబాల తరఫున కోరుతున్నానని వెల్లడి
"ఇటీవలే మీరు 20 మంది తెలుగు మత్స్యకారులను పాకిస్థాన్ నుంచి సురక్షితంగా తీసుకువచ్చారు. తెలుగు ప్రజలు మీ సేవలను సదా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు కూడా 58 మంది ట్రైనీ ఇంజినీర్లను సురక్షితంగా తీసుకురావాలని వారి కుటుంబాల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ తన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.