కవితాత్మక డైలాగులతో 'జాను'... ట్రైలర్ ఇదిగో!

  • శర్వానంద్, సమంత జంటగా 'జాను'
  • తమిళ చిత్రం '96'కి రీమేక్ గా 'జాను'
  • ఇటీవల వచ్చిన టీజర్, సాంగ్స్ కు విశేష ఆదరణ
తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో ప్రేమకథా చిత్రం 'జాను'. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. నా కోసం ఓ చూపు అప్పుగా ఇవ్వలేవా... నీ ఓర చూపు కోసం, నీతో ఒక నవ్వు కోసం, రాత్రంతా చుక్కలు లెక్కబెడుతోంది నా హృదయం అంటూ శర్వా కవితాత్మక డైలాగులతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తే యూత్ కు ఓ పండుగలాంటి సినిమా అని అర్థమవుతోంది. తమిళ చిత్రం '96'కి రీమేక్ గా తెరకెక్కుతున్న 'జాను' చిత్రానికి సి.ప్రేమ్ కుమార్ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల వచ్చిన టీజర్, సాంగ్స్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ తో 'జాను'పై మరింత హైప్ పెరిగింది.

Go Back to Shorts
Jaanu
Trailor
Sharwanand
Samantha
Tollywood
Dil Raju

More Telugu News