Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓ అభిమాని చేసిన పని నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది: హీరో సుమన్

  • ఓ అభిమాని పెళ్లికి ఆహ్వానించాడు 
  • నేను రాకపోతే పెళ్లి ఆగిపోతుందని చెప్పాడు 
  • అన్నంత పనీ చేశాడన్న సుమన్  
తెలుగు తెరకి 'ఇద్దరు కిలాడీలు' సినిమా ద్వారా హీరోగా పరిచయమైన సుమన్, 'తరంగిణి' సినిమాతో పాప్యులర్ అయ్యారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తనకి ఎదురైన ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "తిరుపతిలో నాగరాజు నాయుడు అని నాకు ఒక అభిమాని ఉండేవారు. ఆయన నన్ను తన పెళ్లికి ఆహ్వానించారు.

'సార్ .. మీరు రాకపోతే మాత్రం పెళ్లి ఆగిపోతుంది .. నేను తాళి కట్టను' అన్నాడు. మాట వరసకి అలా అని వుంటాడనుకుని. 'వస్తాన్లే' అన్నాను. ఆ తరువాత నేను బెంగళూర్లో షూటింగులో వున్నాను. ఆ సమయంలో తిరుపతి నుంచి కాల్ వచ్చింది. 'సార్ .. మీరు రాకపోతే అబ్బాయి తాళికట్టనంటున్నాడు .. మీ కోసమే వెయిట్ చేస్తున్నాడు' అని. ఫోన్లో నచ్చచెబుదామని చూస్తే ఆ అభిమాని వినలేదు. దాంతో షూటింగ్ ఆపేసి కార్లో నేరుగా పెళ్లి మంటపానికి వెళ్లాను. అప్పుడుగానీ ఆ అబ్బాయి .. అమ్మాయి మెళ్లో తాళి కట్టలేదు" అంటూ నవ్వేశారు.
Suman
Ali
Nagaraju Nayudu

More Telugu News