'లోకల్ బాయ్'గా వస్తున్న ధనుశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'లోకల్ బాయ్'గా వస్తున్న ధనుశ్

  • తమిళనాట హిట్ కొట్టిన 'పట్టాస్'
  • తెలుగు టైటిల్ గా 'లోకల్ బాయ్' 
  • వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు
తమిళనాట ధనుశ్ కి విపరీతమైన క్రేజ్ వుంది. తెలుగులోనూ ఆయనకి మంచి ఫాలోయింగ్ వుంది. అందువలన తమిళంతో పాటు తెలుగులోను ఆయన సినిమాలను విడుదల చేస్తుంటారు. ఇటీవల తమిళనాట విడుదలైన ధనుశ్ సినిమా 'పట్టాస్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ధనుశ్ ద్విపాత్రాభినయం చేయగా, స్నేహ .. మెహ్రీన్ కథానాయికలుగా నటించారు.

దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, 'లోకల్ బాయ్' టైటిల్ తో నిర్మాత సతీశ్ కుమార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వచ్చేనెలలో ఈ సినిమాను ఇక్కడ విడుదల చేయనున్నారు. ధనుశ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కి ప్రాధాన్యత ఇచ్చారు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుని మరీ ధనుశ్ చేసిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నవీన్ చంద్ర మెప్పించాడు.
Dhanush
Mehreen
Sneha
Local Boy

More Telugu News