సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • రూటు మార్చిన సమంత
  • బావకు థ్యాంక్స్ చెప్పిన బన్నీ 
  • షార్ట్ ఫిలింలో శ్రుతి హాసన్
 *  ప్రస్తుతం అటు సినిమాలతోనూ.. ఇటు వెబ్ సీరీస్ తోనూ బిజీగా వున్న అందాలతార సమంత త్వరలో ఎడ్యుకేషన్ బిజినెస్ లోకి కూడా ప్రవేశిస్తోంది. త్వరలో హైదరాబాద్, జూబ్లీ హిల్స్ లో ఏర్పాటవుతున్న 'ఏకమ్' అనే ప్రీ స్కూల్ నిర్వహణలో తను కూడా భాగస్వామి అవుతోంది.
*  అల్లు అర్జున్ తను తాజాగా నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో పలు ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. దీనికి నిన్న మీడియా సమావేశంలో బన్నీ స్పందించాడు. 'మీ అందరి సమక్షంలో మా బావకు థ్యాంక్స్ చెబుతున్నాను.. థ్యాంక్యూ బావా' అంటూ కృతజ్ఞతలు తెలిపాడు.
*  కథానాయిక శ్రుతి హాసన్ తాజాగా 'దేవి' అనే షార్ట్ ఫిలింలో నటించింది. బాలీవుడ్ హీరోయిన్లు కాజోల్, నేహా ధూపియా వంటి వాళ్లతో కలిసి ఇందులో శ్రుతి నటించింది. ఒకే తరహా సమస్యతో పోరాడుతున్న తొమ్మిది మంది యువతులు కలసికట్టుగా ఆ సమస్యను ఎలా ఎదుర్కున్నారు? అన్న అంశం ఆధారంగా ప్రియాంక బెనర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ లఘు చిత్రాన్ని మార్చి 8న విడుదల చేస్తారు.  

Samantha
Allu Arjun
Junior NTR
Shruti Hassan

More Telugu News