Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జబర్దస్త్' నుంచి నాగబాబుగారు వెళ్లడం బాధించింది: కమెడియన్ అప్పారావ్

  • నాగబాబుగారికి 'జబర్దస్త్' అంటే ఇష్టం
  • గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినా మానలేదు 
  • ఆవైపు నుంచి ఆయన క్లారిటీ ఇచ్చారన్న అప్పారావ్ 
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన కమెడియన్లలో అప్పారావ్ ఒకరు. తనదైన బాడీ లాగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో అప్పారావ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'జబర్దస్త్' కామెడీ షోకి నాగబాబుగారు ఒక నిండుదనాన్ని తీసుకొచ్చారు. ఈ కామెడీ షో అంటే నాగబాబుగారికి చాలా ఇష్టం.

అందువల్లనే ఆ మధ్య చాలా తీవ్రంగా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ ఆయన మానుకోలేదు. ఆయన ఈ షోను ఎంతగా ప్రేమించారనడానికి ఇదో నిదర్శనం. అలాంటిది ఆయన ఈ షో నుంచి ఎందుకు తప్పుకున్నారనేది నాకు తెలియదు. తాను ఈ షో నుంచి తప్పుకోవడానికి గల కారణం పారితోషికం మాత్రం కాదని నాగబాబుగారే చెప్పారు. అందువలన ఆ వైపు నుంచి ఎలాంటి సందేహం లేనట్టే. ఏదేవైనా ఆయన ఈ షో నుంచి తప్పుకోవడం బాధ కలిగించే విషయమే" అని చెప్పుకొచ్చాడు.
NagaBabu
Appa Rao
Jabardasth

More Telugu News