Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా షూటింగ్ ఆపుకుని శివాజీ గణేశన్.. ప్రభుల సెట్స్ చుట్టూ తిరగాల్సి వచ్చింది: నటుడు విజయరంగరాజు

  • శారద స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది 
  • విజయ్ కాంత్ సినిమాలో చేస్తున్నాను 
  •  శివాజీ అలా అన్నారన్న విజయ రంగరాజు   
తెలుగుతోపాటు వివిధ భాషల్లో ప్రతినాయకుడిగా విజయరంగరాజు మంచి పేరు తెచ్చుకున్నారు. గతంలో తనకి ఎదురైన ఒక అనుభవాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించారు. "అప్పట్లో చెన్నైలోని శారద స్టూడియోలో ఒక ఫ్లోర్ లో నా సినిమా షూటింగ్ జరుగుతోంది. మరో ఫ్లోర్ లో శివాజీ గణేశన్ గారి షూటింగ్ జరుగుతోంది. అక్కడికి కొద్దీ దూరంలోనే ప్రభు సినీ షూటింగ్ అవుతోంది.

అంతలో నా కో ఆర్టిస్ట్ వచ్చి శివాజీ గణేశన్ షూటింగ్ జరుగుతోందనీ, వెళ్లి కలుద్దామని అన్నాడు. సరేలే అని చెప్పేసి, ఆయన దగ్గరికి వెళ్లాను. సాధారణంగా నేను ఎక్కడ కలిసినా నన్ను ఆయన మొట్ట (గుండు) అని పిలుస్తుంటారు. నన్ను చూడగానే 'ఏ హీరో కాంబినేషన్లో చేస్తున్నావ్' అని అడిగారు. 'హీరో విజయ్ కాంత్' అన్నాను నేను. 'అలాంటి ఒక ఆర్టిస్ట్ వున్నాడా?' అని అడిగారాయన. అప్పటికే విజయ్ కాంత్ స్టార్ హీరో. 'ఇంకా మీ సెట్లో ఎవరున్నారు'? అని అడిగారు. కలవడానికి వాళ్లు రాలేదేమిటి? అన్నట్టుగా. ఆ తరువాత 'ప్రభు'ను కలవమని చెబితే అక్కడికి వెళ్లాను. ఆయన కాసేపు మాట్లాడి, 'నాన్నగారిని కలిశారా?' అని అడిగారు. అలా నా సినిమా షూటింగు సమయంలో వాళ్ల సెట్స్ చుట్టూ తిరగాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.
Vijaya Ranga Raju
Shivaji Ganeshan
Prabhu

More Telugu News