రజనీ కొత్త మూవీ టైటిల్ గా 'అన్నాత్త'
- సెట్స్ పై రజనీ 168వ సినిమా
- టైటిల్ ను ఖరారు చేసిన దర్శకుడు
- కీలకమైన పాత్రలో కీర్తి సురేశ్
ఈ సినిమాకి 'అన్నాత్త' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించవలసి వుంది. రజనీకాంత్ సరసన ఖుష్బూ .. మీనా నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుందని అంటున్నారు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారనీ, కెరియర్లో చెప్పుకోదగిన పాత్రల్లో ఒకటి ఆయన ఈ సినిమాలో చేస్తున్నారని అంటున్నారు.