చకచకా అడుగులు... ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దుకు నేడే ఆమోదం!
- ఆమోదముద్ర వేసిన క్యాబినెట్
- అసెంబ్లీ ఆమోదం పొందిన వెంటనే కేంద్రానికి
- ఆపై అసెంబ్లీ నిరవధిక వాయిదా
మరికాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలుత కొన్ని బిల్లులకు ఆమోదం పొంది, ఆపై మండలి రద్దు బిల్లును చర్చకు పెడతారని సమాచారం. మండలి రద్దు బిల్లుకు ఆమోదం లభించిన తరువాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడనుంది. అయితే, నేటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్న సంగతి తెలిసిందే.