చైనాలో 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం... పని ప్రారంభించిన వందలాది జేసీబీలు!
- రోగులందరికీ ఒకే చోట చికిత్స
- శ్రామిక శక్తి అపారంగా ఉన్న చైనా
- శరవేగంగా భారీ ఆసుపత్రి నిర్మాణం
ఇప్పటికే వందలాది జేసీబీలు పునాదుల పని ప్రారంభించాయి. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఈ భవంతి నిర్మాణం సాగనుండగా, పనులు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇదిలావుండగా, చైనాలో ప్రజలు ఈ వైరస్ పేరు చెబితేనే తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. వీధుల్లోకి రావాలంటే మాస్క్ లేకుండా ఎవరూ రావడం లేదు. ఎన్నో ఆసుపత్రుల బయట టెంట్లు వేసి వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందిస్తున్నారు. కరోనా బారిన పడి ఇప్పటివరకూ 50 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.