గర్భం దాల్చిన 12 ఏళ్ల బాలిక.. ఆరోగ్య పరీక్షల్లో బయటపడిన వైనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గర్భం దాల్చిన 12 ఏళ్ల బాలిక.. ఆరోగ్య పరీక్షల్లో బయటపడిన వైనం

  • అనాథగా మిగిలిన బాలికను ఇంటికి తీసుకొచ్చిన మేనమామ
  • వివాహం చేసుకుని కాపురం
  • విచారణ చేపట్టిన ఐటీడీఏ అధికారులు
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలకు ఆరోగ్య పరీక్షలు చేస్తుండగా ఓ దారుణం వెలుగు చూసింది. 12 ఏళ్ల బాలిక గర్భంతో ఉన్నట్టు గుర్తించిన వైద్యులు విస్తుపోయారు. ఆ వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిందీ ఘటన. ఐటీడీఏ అధికారుల కథనం ప్రకారం.. ఒడిశాలోని గంజాం జిల్లా బత్రసాయి పరిధిలోని గౌడుగ్రామానికి చెందిన బాలిక (12) తల్లిదండ్రులు మరణించడంతో అనాథగా మిగిలింది.

శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని బుడారిసింగి పంచాయతీ పరిధిలోని గుడ్డికోలకు చెందిన యువకుడు, తనకు మేనకోడలు అయిన బాలికను ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాడు. ఈ క్రమంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిపురం ఆరోగ్య కేంద్రంలో బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆమె గర్భిణి అని తేలడంతో విస్తుపోయిన వైద్యాధికారులు వెంటనే సీతంపేట ఐటీడీఏ అధికారులకు సమాచారం అందించారు. వారు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Girl
Pregnant
Srikakulam District
ITDA

More Telugu News