ఈ సంవత్సరం 69 మంది కొత్త కోడళ్లు... మొదలైన నాగోబా జాతర... కనిపించిన నాగుపాము!
- ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో నాగోబా జాతర
- సంప్రదాయ పూజలతో మొదలు
- పాము కనిపించడంతో మెస్రం వంశీయుల ఆనందం
ప్రతి జాతర ముందూ కొత్త కోడళ్లను ఆలయానికి తీసుకుని వచ్చి 'బేటింగ్' అనే ప్రక్రియ నిర్వహించి, ఆపై వారికి నాగోబా దర్శనం కల్పించిన తరువాత జాతర మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో నాగుపాము కూడా కనిపించడంతో ఈ సంవత్సరం దేవుడు తమను ఆశీర్వదించాడని మెస్రం వంశస్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.