ఇంత ఖరీదైన ఎన్నికలు తెలంగాణ ప్రజలు చూడలేదు: టీ-బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్

  • అధికార అక్రమార్కుల అక్రమాలు ప్రజలు గమనించాలి
  • అక్రమాలు జరిగినా బీజేపీ మంచి ఫలితాలు సాధించింది
  • మూడు మున్సిపాల్టీలలో సొంతంగా గెలిచాం
ఇంత ఖరీదైన ఎన్నికలను తెలంగాణ ప్రజలే కాదు యావత్తు దేశ ప్రజలు ఎక్కడా చూడలేదని టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్  విమర్శించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార అక్రమార్కులు ఏ విధంగా అక్రమాలు చేశారో తెలంగాణ ప్రజలు గమనించారని అన్నారు.

 ఈ ఎన్నికల్లో ఇన్ని అక్రమాలు జరిగినప్పటికీ తాము మంచి ఫలితాలను సాధించామని, మూడు మున్సిపాల్టీలలో సొంతంగా గెలిచామని, కొన్ని మున్సిపాల్టీలలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారామని చెప్పారు. దొడ్డిదారిన నెగ్గే పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి వచ్చిందంటే ఆ పార్టీ పరిస్థితి  ఎంత దయనీయంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. 120 మున్సిపాల్టీలలో నాలుగైదింటిని మినహాయిస్తే మిగిలిన చోట్ల బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
BJP
Laxman
Telangana Municipal Elections

More Telugu News