Tenali: దీక్షా శిబిరంపై టమాటా, కోడిగుడ్లతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు

షార్ట్స్‌లో చూడండి
గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ, ఐకాస శ్రేణులు రిలే దీక్షను చేపట్టాయి. వీరి దీక్షా శిబిరంపై టమాటాలు, కోడిగుడ్లతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. అంతేకాదు శిబిరానికి నిప్పు పెట్టి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు శిబిరానికి అంటుకున్న మంటలను ఆర్పివేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాదన జరిగింది.

వైసీపీ శ్రేణులు చేసిన దాడిలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుద్దూస్ గాయపడ్డారు. ఈ దాడి సమాచారం అందుకున్న వెంటనే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో, మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Go Back to Shorts
Tenali
Telugudesam
YSRCP

More Telugu News