అష్టదిగ్బంధంలో చైనా.. 26కు చేరిన 'కరోనా' మృతులు
- చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్
- అష్టదిగ్బంధంలో 13 నగరాలు
- చైనాలోని భాతర ఎంబసీలో రిపబ్లిక్ డే వేడుకల రద్దు
మరోవైపు, కరోనా వైరస్ కోరలు చాస్తుండడంతో దేశంలో ఎక్కడా కొత్త సంవత్సర వేడుకల జాడ కనిపించలేదు. చైనా కొత్త సంవత్సరమైన మూషిక ఏడాది నేటి నుంచే ప్రారంభమైంది. చైనాలో ఇది అతిపెద్ద పండుగ అయినప్పటికీ ఎక్కడా సందడి లేదు. వ్యాధి మరింత విస్తరించకుండా చేపట్టే చర్యల కోసం ప్రభుత్వం వంద కోట్ల యువాన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1008 కోట్లు కేటాయించింది. కరోనా వైరస్ బాధితులకు చికిత్స కోసం సైన్యంలోని వైద్యాధికారుల్ని రంగంలోకి దించారు. ఇక, చైనాలోని భారత రాయబార కార్యాలయంలో రేపు జరగాల్సిన భారత రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేశారు.