టర్కీని కుదిపేసిన భారీ భూకంపం.. 18 మందికి పైగా మృతి
- రిక్టర్ స్కేలుపై 6.8గా తీవ్రత నమోదు
- 500 మందికి పైగా గాయాలు
- స్వల్ప కాలంలోనే 60 ప్రకంపనలు
భూకంపం ధాటికి కూలిన భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శిథిలాల కింద 30 మంది వరకు చిక్కుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాగా, సిరియా, లెబనాన్‌లోనూ భూప్రకంపనలు సంభవించినట్టు అధికారులు తెలిపారు.