Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ బాలీవుడ్ భామ హెయిర్ స్టయిల్ కోసం రూ.2.5 లక్షలు!

  • నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ చిత్రం స్ట్రీట్ డ్యాన్సర్-3డీ
  • ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించిన నోరా ఫతేహీ
  • ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ కోసం లక్షలు ఖర్చు
ఇప్పటి సినిమాల్లో నాణ్యత కోసం ఎక్కడా రాజీపడడంలేదు. భారీగా ఖర్చు చేస్తూ ప్రతి ఫ్రేమును ఒక విజువల్ ఫీస్ట్ గా తీర్చిదిద్దేందుకు నిర్మాతలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయితే, నటీనటుల హెయిర్ స్టైల్ కోసం లక్షలు ఖర్చు చేశారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇవాళ విడుదలైన బాలీవుడ్ చిత్రం స్ట్రీట్ డ్యాన్సర్-3డీ సినిమాలో నోరా ఫతేహీ కెనడియన్ డ్యాన్సర్ పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్రలో నోరా ప్రత్యేకంగా కనిపించేందుకు ఆమె హెయిర్ స్టైల్ లో మార్పులు చేశారు. ఒత్తుగా, పొడవుగా ఉండే పోనీటెయిల్ కోసం రూ.2.5 లక్షలు ఖర్చు చేశారు.

కేవలం నోరా కోసమే  ఆ పోనీటెయిల్ తయారుచేశారట. కొంచెం బరువుగా ఉన్నా లుక్ కోసం భరించానని నోరా తెలిపారు. స్ట్రీట్ డ్యాన్సర్-3డీ చిత్రంలో శ్రద్ధా కపూర్, నోరా ఫతేహీ ఒకరితో ఒకరు పోటీ పడి డ్యాన్స్ చేసే సన్నివేశం ఉంటుంది. అందులో నోరా లుక్ డిఫరెంట్ గా కనిపించేందుకే లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా హెయిర్ స్టైలింగ్ చేయించారు.
Nora Fatehi
Hair Style
Street Dancer-3D
Bollywood

More Telugu News