అంతమాత్రానికే మండలిని రద్దు చేసేస్తారా?: సీపీఐ రామకృష్ణ
- రాజధాని బిల్లును మండలి తిరస్కరించ లేదు.
- మీ సొంత నిర్ణయాలను ప్రజలపై రుద్దడం భావ్యమా
- అలాగనుకుంటే ఇడుపులపాయ నుంచి పాలన చేయండి
జగన్ తన సొంత నిర్ణయాలను ప్రజలపై రుద్దుతూ లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని అన్నది రాజ్యాంగంలో లేనప్పుడు మూడు రాజధానులు ఎందుకని, అటువంటప్పుడు ఇడుపులపాయ నుంచే పాలన సాగించవచ్చుకదా అని సూచించారు. ఏపీ పేద రాష్ట్రం అయితే రైతులకు వ్యతిరేకంగా వాదించేందుకు రూ.5 కోట్లు ఇచ్చి న్యాయవాదిని ఎందుకు నియమించారని ప్రశ్నించారు.