పాలకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవు సీఎం గారూ... హిట్లర్, నెపోలియన్ వారసుడిగా మిగిలిపోవడం ఖాయం: వర్ల రామయ్య

  • కౌంటర్ ఉద్యమాలు చేయిస్తున్నారంటూ ఆరోపణ
  • ప్రజల్లో వైషమ్యాలు పెంచుతున్నారని ఆగ్రహం
  • ట్విట్టర్ లో స్పందించిన వర్ల రామయ్య
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ప్రజా ఉద్యమాలను ఎదుర్కోలేక, సమస్యలను పరిష్కరించలేక తన వాళ్లతో సీఎం కౌంటర్ ఉద్యమాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎదురు ఉద్యమాల సృష్టికర్తగా మీరు చరిత్రలో నిలిచిపోతారంటూ ఎద్దేవా చేశారు. "ప్రజలలో వైషమ్యాలు పెంచుతూ, వర్గపోరుకు జనాలను ప్రేరేపిస్తున్న మీలో పాలకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవు సీఎం గారూ... మీరు హిట్లర్, నెపోలియన్ వారసుడిగా మిగిలిపోతారు" అంటూ విమర్శించారు.
Go Back to Shorts
Varla Ramaiah
Telugudesam
Jagan
YSRCP
Amaravati
AP Capital
Andhra Pradesh

More Telugu News