సాధ్వి పద్మావతి ఆరోగ్యం క్షీణిస్తోంది.. కొంచెం చూడండి: మోదీకి నితీశ్ లేఖ
- ఫలితమివ్వని గంగానది ప్రక్షాళన కార్యక్రమం
- గత నెలలో నిరాహార దీక్షకు దిగిన సాధ్వి పద్మావతి
- ఆమె ఆరోగ్యం గురించి ఆలోచించాలన్న నితీశ్
గంగానది ప్రక్షాళనకు మోదీ ప్రభుత్వం నడుం బిగించినా ఆ కార్యక్రమం అనుకున్నంత స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో బీహార్‌లోని నలంద ప్రాంతానికి చెందిన సాధ్వి పద్మావతి హరిద్వార్‌లో నిరాహార దీక్షకు దిగారు. గంగానదిని ప్రక్షాళన చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆమె ప్రారంభించిన నిరాహార దీక్ష నెల రోజులు దాటిపోయింది. రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఆందోళన చెందిన బీహార్ సీఎం నితీశ్ తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు.